Pages

Tuesday, September 11, 2018

కన్నీరేలమ్మా కరుణించు-Kanneerelamma Song Lyrics and Video


            కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా 
కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పి
యేసే తొడమ్మా 

1.    నీకేమి లేదని ఏమి తెలీదని 
అన్నారు నిన్ను అవమానపరిచారా
తల రాత ఇంతేనని తరువాత ఏమవునని 
రేపటిని చింతించుచున్నావా
చింతించకన్నా యేసు మాటలు మరిచావా
మారాను మధురముగా మార్చెను చూసావా         ||కన్నీరేలమ్మా ||

2.    నీకెవరు లేరని ఏమి చేయలేవని 
అన్నారా నిన్ను నిరాస పరిచారా
పురుగంటి వాడవని  ఎప్పటికి ఇంతేనని 
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా 
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా 
కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా             ||కన్నీరేలమ్మా ||

No comments:

Post a Comment